సండే కదా..
డీ-మార్ట్ షాపింగ్ ప్లాన్ చేశారా..? ఈ విషయం తెలుసా మరి..!

డీ-మార్ట్ లాభం 685 కోట్లు..
గతఏడాదితో పోలిస్తే 3.85 శాతం ఎక్కువ
15 శాతం పెరిగిన ఆదాయం.. రెండో క్వార్టర్లో రూ.16,676 కోట్లు

BB6 TELUGU NEWS CHANNEL
డీమార్ట్ పేరుతో రిటైల్ స్టోర్లు నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్ మార్క్స్ లీమిటెడ్ రెండో క్వార్టర్ లో (ఈ ఏడాది సెప్టెంబర్ ముగిసిన) కన్సాలిడేటెడ్ పద్దతిలో రూ. 684.85 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే క్వార్టర్ లో (జూలై-సెప్టెంబర్) ఉన్న రూ. 659.44 కోట్ల నికరలాభంతో పోలిస్తే 3.85 శాతం ఎక్కువ.కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చినఆదాయం రెండో క్వార్టర్ లో 15.45 శాతంపెరిగి రూ. 16,676.30 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ లో ఆదాయం రూ. 14,444.50 కోట్లుగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్ లో నికరలాభం మార్జిన్ 4.1 శాతం ఉంది.

ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్లో 4.6 శాతంగా నమోదైంది.మొత్తం ఖర్చులు ఈ క్వార్టర్లో 16 శాతం పెరిగి రూ. 15,751.08 కోట్లుగా ఉన్నాయి.ఇతర ఆదాయంతో కలిపి మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.3శాతం పెరిగి రూ. 16,695.87 కోట్లకు చేరింది. ఫలితాలపై కంపెనీ సీఈఓ – కొత్త అన్షుల్ అసవా మాట్లాడుతూ, 2025 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ తో పోలిస్తే, 2026 ఆర్థిక సంవత్సరంలో రెండో క్వార్టర్ లో తమ స్టోర్ల సంఖ్య 6.8శాతం పెరిగిందని తెలిపారు. GST సంస్కరణల ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు ధరలను తగ్గించామని
వివరించారు.

వైదొలిగిన

ఈ క్వార్టర్లో కంపెనీ అగ్ర నాయకత్వంలో మార్పులు జరిగాయి. అన్షుల్ డీ-మార్ట్రిటైల్ స్టోర్ వ్యాపారంలోని అన్ని కార్యకలాపాల బాధ్యతలను స్వీకరించారు.ప్రస్తుత సీఈఓ పదవీకాలం వచ్చే జనవరిలో ముగుస్తోంది. 2007 నుంచిడీ-మార్ట్ సీఈఓగా ఉన్న నెవిల్ నొరోన్హా ఈ బాధ్యతలో కొనసాగడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఈ ఏడాది జనవరిలో నేడీ-మార్ట్ తన సీఈఓగా అన్షుల్ అసవాను ప్రకటించింది. ఈ క్వార్టర్ లో కంపెనీ ఎనిమిది కొత్త స్టోర్లను ప్రారంభించింది.దీనితో సెప్టెంబర్ 30, 2025 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 432కు పెరిగింది. ఈక్వార్టర్లో ఐదు నగరాల్లో (అమృత్సర్,బెల్గావి, భిలాయ్, చండీగఢ్,ఘజియాబాద్) తన ఈ-కామర్స్ సర్వీస్డీ-మార్ట్ రెడీ కార్యకలాపాలను కంపెనీ నిలిపివేసింది.

“మేము మా ప్రస్తుత మార్కెట్లలో 10 కొత్త ఫుల్ ఫిల్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేశాం. మెట్రో నగరాల్లో మా ఉనికిని విస్తరించడానికి పెట్టుబడులు పెడుతూనే ఉన్నాం” అని అవెన్యూ ఈ-కామర్స్హోల్ టైమ్ డైరెక్టర్ విక్రమ్ దాసుచెప్పారు. రాధాకిషన్ దమానీ, ఆయన కుటుంబం ప్రమోట్ చేస్తున్న డీ-మార్ట్ మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు,మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఎన్సీఆర్, ఛత్తీస్గఢ్ డయూ-డామన్ లాంటి మార్కెట్లలో స్టోర్లు నిర్వహిస్తోంది. ఇవి ఇంటి సామాన్లు, కిరాణా సామగ్రి,దుస్తులను అమ్ముతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe