BB6 TELUGU NEWS CHANNEL:
మహబూబ్నగర్ జిల్లా మండలంలోని గండీడ్ గ్రామం పరిధిలో రైతు రామయ్య వరి పొలంలో నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను మండల వ్యవసాయ అధికారి నరేందర్ వివరించారు. ఇందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు లక్ష్మి నారాయణ గారు, వ్యవసాయ విస్తరణ అధికారి సమత, వెంకటయ్య మరియు పరశురాములు పాల్గొన్నారు.
ఇది అన్ని పంటలకు ఉపయోగపడుతుంది.
సురక్షితమైన మరియు పర్యావరణ అనుకూలమైన స్థిరమైన వ్యవసాయానికి ఉపయోగపడుతుంది .
దిగుబడిని ప్రభావితం చేయకుండా యూరియా మరియు ఇతర నత్రజని కలిగిన యూరియాను ఆదా చేస్తుంది.
పర్యావరణ కాలుష్యం సమస్య నుండి విముక్తి, అంటే నేల, గాలి మరియు నీటి నాణ్యతను మెరుగుపరచడంతోపాటు దాని ఎరువుల వినియోగ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.
పంట ఉత్పత్తి పెరుగుదల నాణ్యత కూడా పెరుగుతుంది.
ఎరువుల యొక్క రవాణా మరియు నిల్వ ఖర్చులు తగ్గుతాయి మరియు రవాణా సులభం అవుతుందని తెలిపారు.
అదే విధంగా రైతు కటికె మల్లోజీ వరి పంట సాగును పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ సూచనలు చేశారు. ప్రస్తుతం వరి పంట పిలక దశలో ఉన్నందున కాండం తొలుచు పురుగు ఆశించి నష్ట పరుస్తుoది కావున సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే పొలంలో పంటకు ఎక్కువగా యూరియా వాడడం వల్ల పురుగులు లేదా తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
వరి పంట సాగులో పిలక దశలో కాండం తొలుచు పురుగు నివారణకు కార్బోపూరాన్ 3జి గుళికలను లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4జి 8కిలోలు, లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0,4జి గుళికలు 4 కిలోలు పలుచగా నీటిని కట్టి వేయాలి. ఎకరానికి 3 లింగాకర్షక బుట్టలను అమర్చి వారానికి బుట్టకు 25 లేదా అంతకు మించి మగ రెక్కలు పురుగులు పడినట్లైతే పురుగు మందులు పిచికారి చేయాలి. మాస్ ట్రాపింగ్ పద్దతి ప్రకారం ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలను అమర్చటం ద్వారా ఈ పురుగును నివారించవచ్చు.
వరి పొలంలో నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించిన మండల వ్యవసాయ అధికారి నరేందర్

25
Aug