BB6 TELUGU NEWS 16 Aug 2025 :
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల కేంద్రంలోని చెందిన ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల ప్రధానఉపాధ్యాయులు వార్డెన్ సుందర్ రాజ్ కు గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ తరపున ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా ఉత్తమ ఉద్యోగి సేవ రావడం అభినందనీయమని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కమలాకర్ రెడ్డి అన్నారు 79 వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి సేవ అవార్డు గుర్తింపు ప్రశంస పత్రాన్ని అందుకున్నారు ఈ సందర్భంగా సుందర్ రాజ్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు సేవ చేయడం నా అదృష్టంగా భావిస్తూ ఇకముందు గిరిజన విద్యార్థులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇవ్వడం ద్వారా నాకు ఎంతో గౌర్వంగా ఉందని అన్నారు
ఉత్తమ ఉద్యోగి అవార్డు పురస్కారం

16
Aug