BB6 TELUGU NEWS : 7 Aug 2025 : వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండల పరిధిలో ఇప్పాయిపల్లి రాంపూర్ గ్రామాలలో ఎస్బిఐ సౌజన్యంతో ఏర్పాటుచేసిన *జన సురక్ష శిబిరం విడ్స్ సంస్ద వారి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం తరఫున ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిఎం ఎన్ డబ్ల్యు సతీష్ కుమార్ జర్నల్ మేనేజర్ డిజిఎం ఎల్ హెచ్ ఓ హైదరాబాద్ వినోద్ కుమార్ కస్తూరి సి జి ఎం ప్రాంతీయ డైరెక్టర్ ఆర్బిఐ హైదరాబాద్ చిన్మోయ్ కుమార్ జ ఎం ఆర్బిఐ హైదరాబాద్ ముత్యాల జ్ఞాన సుప్రభాత్ స్థానిక ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ గోపాల్ సింగ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకు ఖాతాలో పొదుపు చేసుకోవాలని తెలియజేశారు గ్రామాలలో మినీ బ్యాంకులను వినియోగించుకోవాలి ప్రజలకు బ్యాంకు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఎస్బిఐ లో కూడా అన్ని లోను సౌకర్యాలు మరియు రకరకాల పాలసీలు కూడా ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ వివిధ పార్టీ రాజకీయ నాయకులు ఎస్బిఐ ఖాతాదారులు మహిళా సంఘ సభ్యులు సి ఎఫ్ ఎల్ కౌన్సిలర్స్ మల్లేష్ సురేష్ శ్రీకాంత్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

