BB6 TELUGU NEWS 7 Aug 2025
BC Reservations: బీసీ రిజర్వేషన్ల అంశంలో.. తప్పందా బీజేపీదే అని చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందా? ఈ అంశంపై బీజేపీ ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడుతోందా? తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయిగా.
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం కాక రేపుతోంది. చెప్పాలంటే ఈ విషయంలో కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. బీసీల కోసం నిజంకా కృషి చేస్తోంది తామే అని చెప్పుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. దానికి కాంగ్రెస్ చేతలు కూడా ఉపయోగపడుతున్నాయి. కులగణన చేపట్టి.. బీసీలు 42 శాతం మంది ఉన్నారు అని చెబుతూ.. వారికి అనుకూలంగా బిల్లులను ఆమోదించి.. రాష్ట్రపతి ఆమోదానికి పంపి.. వాటిని ఆమోదించాలి అని జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా చేసి.. కాంగ్రెస్ తన వంతు ప్రయత్నం తాను చేశానని అంటోంది. ఇక ఈ అంశంలో తాము చెయ్యాల్సింది ఏమీ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీయే తేల్చాలని అనేశారు. తద్వారా బంతిని బీజేపీ కోర్టులోకి తెలివిగా నెట్టినట్లైంది.
BC Reservations: కాంగ్రెస్ చేయాల్సింది చేసింది.. బీజేపీ కోర్టు లోకి బంతిని పంపిన సీఎం రేవంత్!

07
Aug