BB6 TELUGU NEWS 2 july 2025 : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి.. 8 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 2,70,640 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,76,461 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 882.20 అడుగులు.. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద.. ఇన్ ఫ్లో 2 లక్షల 38 వేల 629 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 2 లక్షల 56 వేల 417 క్యూసెక్కులు.. 24 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 ఫీట్లు పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 585.20 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.

