BB6TELUGUNEWS 31 july 2025 : మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఐదుగురు బాలురు లైంగిక దాడికి యత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సీఐ కమలాకర్ కథనం ప్రకారం.. బాలిక అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు… బాలికపై సామూహిక అత్యాచారయత్నం జరిగినట్లు వెల్లడించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 16ఏళ్లలోపు వయసున్న ఐదుగురు బాలురు మూడు రోజుల కిందట బాలికపై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. బాధితురాలిని మహబూబ్నగర్ లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో తొమ్మిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు లైంగిక దాడికి యత్నిం

31
Jul