హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) (Telangana TET results) 2025 జూన్ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విడుదల చేశారు. టెట్ పరీక్షలకు మొత్తం 90,205 మంది హాజరు కాగా.. 30,649 మంది అర్హత సాధించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 18 నుంచి 30 వరకు మొత్తం 16 సెషన్లలో 7 భాషల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు.
ఫలితాల కోసం ఈ కింద ఉన్న లింకును క్లిక్ చేయండి
https://tgtet.aptonline.in/tgtet/ResultFront
పేపర్ -1కి 47,224 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 29,043 మంది (61.5 శాతం) అర్హత సాధించారు. పేపర్-2 గణితం- సైన్స్కి 48,998 మంది హాజరుకాగా.. 17,574 మంది క్వాలిఫై అయ్యారు.సోషల్ సైన్స్కి 41,207 మంది హాజరుకాగా.. 13,075 మంది అర్హత సాధించినట్టు విద్యాశాఖ పేర్కొంది.రెండు పేపర్లు కలిపి 90,205 మంది హాజరుకాగా..30,649 మంది (33. 98 శాతం) అర్హత సాధించినట్టు ప్రకటించింది. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. కార్యక్రమంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్నికోలస్ సహా పలువురు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.