క్యాబ్ సర్వీసులు అందించే ఉబెర్, ఓలా,రాపిడో డ్రైవర్లు జూలై 15 నుండి సేవలు నిలిపివేయడంతో ముంబై అంతట ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈనిరసన ఎందుకంటే ఎయిర్ పోర్ట్ జోన్,బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, అంధేరి, సౌత్ముంబైతో సహా ప్రముఖ ప్రాంతాల్లో డ్రైవర్ల తక్కువ ఆదాయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగేటర్ కమీషన్లు, పెట్రోల్ కర్చులు తీసేసిన తర్వాత డ్రైవర్ల ఆదాయం కొన్నిసార్లు కిలోమీటరుకు కేవలం రూ.8నుండి రూ.12కి పడిపోతుందని ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు, బండి మెయింటెనెన్స్ ఖర్చులు పెరుగుతుండటంతో ఆదాయం సరిపోవట్లేదని డ్రైవర్లు మొత్తుకుంటున్నారు. డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడుకోవడానికి సరైన రెగ్యూలేటరీ లేకపోవడం వల్ల వీరి నిరాశ మరింత పెరిగింది.
డ్రైవర్ల డిమాండ్లు ఏంటంటే : ఈ సమ్మె మహారాష్ట్ర గిగ్ కామర్ మంచ్,మహారాష్ట్ర రాజ్య రాష్ట్రీయ కామర్సంఘ్, ఇండియన్ గిగ్ వర్కర్స్ ఫ్రంట్వంటి సంస్థలు కలిసి చేస్తున్నాయి. క్యాబ్ చార్జీలను నలుపు-పసుపు రంగు టాక్సీలతో సమానంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే బైక్ట టాక్సీలను నిషేధించాలని, కాలి పీలీక్యాబ్ లు ఇంకా ఆటోలకు కొత్త పర్మిట్ల పరిమితి విధించాలని, యాప్ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి పరిమితి విధించాలని, యాప్ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, వారి హక్కులను కాపాడటానికి మహారాష్ట్ర గిగ్వర్కర్స్ చట్టాన్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ప్రతి రైడ్ పై యాప్స్ అందించే డిస్కౌంట్ల పై కూడా డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రయాణికుల ఇబ్బందులు : క్యాబ్ లు రోడ్డుపైకి రాకపోవడంతో ప్రతిరోజు క్యాబ్లో ప్రయాణం చేసే వారు, ముఖ్యంగా ఎయిర్ పోర్ట్ వెళ్లే వారికీ కష్టంగా మారింది. దీనిపై ముంబై విమానాశ్రయం సోషల్ మీడియాలో ఒక సలహా జారీ చేస్తూ క్యాబ్ డ్రైవర్ల నిరసనల కారణంగా ప్రయాణీకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించింది. సమాచారం ప్రకారం, సమ్మె చేస్తున్న ఓలా, ఉబర్ డ్రైవర్లను జూలై 18 నరవాణా శాఖ అధికారులు చర్చల కోసంజూలై 22 వరకు చూసి తరువాత ఎం చేయాలో నిర్ణయించు కోవాలని చెప్పారు.
ఆదాయం సరిపోవట్లేదు..ఓలా, ఉబెర్, రాపిడో డ్రైవర్ల సమ్మె. మొత్తుకుంటున్న ప్రయాణికులు..

19
Jul