అంతరిక్షంలో సాహసోపేతమైన, చారిత్రాత్మక మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని భూమికి సురక్షితంగా తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
శుభాంశు ప్రదర్శించిన ధైర్యం, అంకితభావం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని, భవిష్యత్ తరాలకు మార్గదర్శిగా నిలుస్తారని అభినందించారు. పైలట్ శుభాంశు భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని, దేశానికి మరింత సేవ చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
కెప్టెన్ శుభాంశు శుక్లాకి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

15
Jul