హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు.మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను కారం చల్లి కాల్చి చంపిన దుండగులు.ఉదయం 7.30 గంటల సమయంలో తెల్లటి స్విఫ్ట్ కారులో వచ్చి హత్య చేసిన నలుగురు దుండగులు.పట్టపగలే నగరం నడిబొడ్డున హత్య జరగడంతో భయాందోళనలో నగర వాసులు
హైదరాబాద్: మలక్ పేటలో కాల్పులు.. శాలివాహననగర్ పార్క్ లో వాకర్స్ పై కాల్పులు జరిపిన దుండగులు.. చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..మలక్ పేట కాల్పుల ఘటనలో నలుగురు లొంగుబాటు.. ఎస్వోటీ పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితులు రాజేష్, శివతో పాటు మరో ఇద్దరు.. మృతుడు చందు నాయక్ తో పాటు నలుగురు నిందితులు ఓ హత్య కేసులో నిందితులు.. ఐదుగురి మధ్య ఆర్థిక లావాదేవీలే చందు నాయక్ హత్యకు కారణమన్న పోలీసులు.
నాగోల్ సాయినగర్ లో గుడిసెలకు సంబంధించి నాలుగేళ్ల క్రితం గొడవ.. ఉదయం నుంచి చందు నాయక్ ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిన దుండగులు.. ఇంటి నుంచి శాలివాహననగర్ పార్క్ కు వెళ్తున్న చందు నాయక్ ను ఫాలో చేసిన దుండగులు.. పార్క్ నుంచి బయటకు రాగానే చందు నాయక్ పై ఏడు రౌండ్ల కాల్పులు.. చందు నాయక్ గతంలో ల్యాండ్ సెటిల్మెంట్లు చేసినట్లు ఆరోపణలు.
