శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం.. ఇకపై ఆన్‌లైన్‌లో టోకెన్లు

శ్రీశైల మహాక్షేత్రంలో సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనం’ టోకెన్ల జారీకి ఆన్‌లైన్‌ విధానం ప్రవేశ పెడుతున్నట్లు ఆలయ ఈవో ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు.

శ్రీశైలం ఆలయం: శ్రీశైల మహాక్షేత్రంలో (Srisailam)సామాన్య భక్తుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మల్లికార్జునస్వామి ‘ఉచిత స్పర్శ దర్శనం’ (Sparsha darshanam)టోకెన్ల జారీకి ఆన్లైన్ విధానం ప్రవేశ పెడుతున్నట్లు ఆలయ ఈవో ఎం. శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభించిన ఉచిత స్పర్శదర్శనానికి భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా టోకెన్లను జారీచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శదర్శనం ఉంటుందన్నారు. వచ్చేవారం నుంచి ఆన్లైన్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఇటీవల భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో వారికి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా టోకెన్లు జారీచేయాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నట్లు ఈవో చెప్పారు.
www. srisailadevasthanam. org,
www. aptemples. ap. gov. in
వెబ్సైట్ల ద్వారా ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లను పొందాల్సి ఉంటుందన్నారు. భక్తులు తమ పేరు,చిరునామా, ఆధార్ నంబర్ను నమోదు చేయాలని తెలిపారు. ఒక రోజు ముందుగానే ఆన్లైన్ ద్వారా టోకెన్లు పొందవచ్చని ఈవో పేర్కొన్నారు. టోకెన్లను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe