తెలంగాణలో కీలక పథకానికి నిధులు విడుదల.LPG Cylinder Subsidy: అకౌంట్లలో జమ అవుతున్న డబ్బులు..

Telangana: సీఎం రేవంత్ రెడ్డి తనకు వస్తున్న రిపోర్టులను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎక్కడ సమస్య ఉందో గుర్తించి, సరిచేస్తున్నారు. తాజాగా కీలక పథకానికి సంబంధించి రిలీజ్ కావాల్సిన డబ్బును విడుదల చేయిస్తూ, లబ్దిదారుల అకౌంట్లలో జమ అయ్యేలా చేయిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రస్తుతం వంటగ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బును లబ్దిదారుల అకౌంట్లలో జమ చేయిస్తోంది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం.. వంట గ్యాస్ సిలిండర్‌ని రూ.500లకే ఇప్పిస్తోంది. మామూలుగా ఈ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.855 ఉంది. పేదవారు, లబ్దిదారులు.. సిలిండర్ కోసం బుక్ చేసుకున్నప్పుడు రూ.855 చెల్లిస్తున్నారు. ఐతే.. వారికి అది రూ.500కే రావాలి కాబట్టి.. వారు చెల్లించిన డబ్బులో.. రూ.355ని వెనక్కి సబ్సిడీ రూపంలో ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ డబ్బును బ్యాంకుల ద్వారా అకౌంట్లలో జమ చేయిస్తోంది. ఐతే.. ఇక్కడో ట్విస్ట్ ఉంది.
ఒకేసారి భారీగా సబ్సిడీ:సిలిండర్ బుక్ చేసుకున్న వారికి.. వెంటనే సబ్సిడీ డబ్బు అకౌంట్లలోకి రావట్లేదు. ప్రభుత్వం.. 2, 3 సిలిండర్ల డబ్బును ఒకేసారి అకౌంట్లలో వేయిస్తోంది. అంటే.. 3 లేదా 4 నెలలకు ఓసారి ఈ డబ్బు జమ అవుతోంది. ఏపీలో ఇలాంటిదే ఉచిత వంటగ్యాస్ సిలిండర్ స్కీమ్ దీపం 2 ఉంది. దాని ప్రకారం.. సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నారు. అక్కడ సిలిండర్ ఇంటికి రాగానే.. 48 గంటల్లో సబ్సిడీ డబ్బును అకౌంట్లలో జమ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం.. అలా కాకుండా.. కొంత ఆలస్యం చేస్తూ.. అప్పుడప్పుడూ సబ్సిడీని ఇస్తూ.. పెండింగ్ లెక్కలు సరిచేస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe