మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సల్కర పేట గ్రామానికి చెందిన గొండాల చంద్రయ్య అనే వ్యక్తి తేదీ: 26/ 6/ 2025 నాడు కొన్ని సంవత్సరాలుగా కాస్తు లో ఉన్న భూమి విషయంలో గత కొన్ని రోజులుగా వారి గ్రామానికి చెందిన గిరమోని శ్రీనివాస్ @ కర్నే శ్రీనివాస్, గిరమోని కృష్ణయ్య , గిరమోని గోవర్ధన్ మరియు ఇతరులతో గొడవలు జరుగుతున్న విషయంలో వారు కోర్టును సంప్రదించి కోర్టులో సివిల్ కేసు కూడా వేసినారు. ఇది ఇలా ఉండగా తేదీ: 24/ 06 /2025 నాడు పైన తెలిపిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులు కొంతమంది కలిసి ఒక ట్రాక్టర్ తో అక్రమంగా ఇట్టి భూముల లోకి ప్రవేశించి దున్నిన విషయంలో గొండ్యాల చంద్రయ్య ఇచ్చిన దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయ నైనదని మహమ్మదాబాద్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వి. శేఖర్ రెడ్డి తెలిపారు.
కాగా ఈ నిందితుడు గెరమోని శ్రీనివాస్ @ కర్నే శ్రీనివాస్ @ డాన్ శ్రీను మరియు ఈయన సహచరులతో కలిసి చేసిన భూకబ్జా నేరాలపై మరియు ఇతర నేరాలపై BB6 TELUGU NEWS CHANNEL ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ టీం సభ్యుల మీద దాదాపు 8 పోలీస్ క్రిమినల్ కేసు ల ఎఫ్.ఐ.ఆర్లు, రెండు సివిల్ కేసులు మరియు ఇంకా కొన్ని క్రిమినల్ కేసుల్లో విచారణ జరుగుతున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పోలీసులు ఒక వ్యక్తి మీద మూడు క్రిమినల్ కేసులకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్లు ఒకే సంవత్సర కాలంలో నమోదైతే అట్టి క్రిమినల్స్ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన పోలీసులు 8 కి పైగా క్రిమినల్ కేసులు నమోదైన కూడా ఈయనపై పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయకపోవడం గమనార్హం.
ఈ వ్యక్తి మరియు అతని సహచరులు ఇన్ని నేరాలకు పాల్పడ డానికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ బలహీనతలు ఎంత? వీళ్లకు వెను కుండి నడిపించే ఆయా డిపార్ట్మెంట్లలోని బలమైన వ్యక్తులు ఎవరని తేల్చాల్సి న బాధ్యత సంబంధిత జిల్లా యంత్రాంగాల పై ఉంది.
*వీళ్లకు సంబంధించిన ప్రతి క్రిమినల్ కేస్ బాధితుల వివరాలు BB6 తెలుగు న్యూస్ ఛానల్ చేతిలో ఉన్నాయి. త్వరలో పూర్తి కథనాలతో BB6 TELUGU CHANNEL లో***********.