మహబూబ్ నగర్ జిల్లా, గండీడ్ మండలం, మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానంపల్లి గ్రామానికి చెందిన బోయిని యాదగిరి మరియు వారి కుటుంబ సభ్యులకు రెవెన్యూ గ్రామం గోవిందు పల్లి లో సర్వే నంబర్ 06 లో వ్యవసాయ పొలం ఉండి ఇట్టి భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ భూమికి వెళ్లడానికి దారికి ఉప్పరి పెద్ద భీమయ్య పొలంలో నుండి 2000 సంవత్సరంలో ఒక పక్కగా దారిని కొనుక్కోవడం జరిగింది. ఇట్టి దారిని ఉప్పరి కౌశల్య @ కంసల మరియు తలారి శ్రీనివాస్ అనే వ్యక్తులు ట్రాక్టర్ తో దున్ని, దారిలో విత్తనాలు పెట్టిన విషయంలో తేదీ 26/06/ 2025 నాడు జానంపల్లి గ్రామానికి చెందిన బోయిని యాదగిరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వి. శేఖర్ రెడ్డి తెలిపారు.
