హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు.
రద్దీగా ఉండే రూట్లను అవాయిడ్ చేయాలి
సిటీ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్
హైదరాబాద్ సిటీ,BB6 TELUGU NEWS CHANNEL : గోల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా గురువారం నుంచి జులై 24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు,మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్డేవిస్ తెలిపారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు,హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు.
గోల్కొండ కోటకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని, దీన్ని గమనించి వాహన దారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రాందేవ్ గూడ నుంచి మక్కాదర్వాజ మీదుగా గోల్కొండ వెళ్లే దారి, ఫతేదర్వాజా మీదుగా లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే మార్గం, బంజారా దర్వాజా ద్వారా గోల్కొండ కోటకు వెళ్లే 7టూంబ్స్ రోడ్డు, అలాగే షేక్పేట నాలా దారి రద్దీగా ఉంటాయన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు వాహన దారులు ఈరూట్లను అవాయిడ్ చేయడం మంచిదని సూచించారు. ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తితే 9010203626 హెల్ప్ లైన్కు కాల్చేయాలని, సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్్వరా ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తామన్నారు.
పార్కింగ్ జోన్లు ఇవే..
రాందేవ్ గూడ నుంచి మక్కాదర్వాజ మీదుగా వచ్చే వాహనదారుల కోసం అషూర్ ఖానా, ఆర్మీ సెంట్రీ పోస్ట్,రాందేవ్ గూడ, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సెట్విన్బస్సులను అషూర్ ఖానా పార్కింగ్ వరకు మాత్రమే అనుమతిస్తారు.ఫతే దర్వాజా మీదుగా లంగర్హౌజ్ నుంచి వచ్చే భక్తులకు ఎంసీహెచ్పార్క్, ఫతే దర్వాజా, గోల్కొండ బస్స్టాప్, అల్జీరా స్కూల్, ఏరియా హాస్పిటల్, గోల్కొండ ప్రాంతాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. షేక్పేట్ నుంచి బంజారా దర్వాజా మీదుగా వచ్చే భక్తులకు గోల్ఫ్ క్లబ్ రోడ్బై-లేన్, హాకీ గ్రౌండ్, ఒవైసీ గ్రౌండ్,డెక్కన్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఏరియాల్లో పార్కింగ్ ఉంటుంది.