ప్రఖ్యాత ఆటో మొబైల్ కంపెనీ, అశోక్ లేలాండ్ టిటిడికి ఒక 41-సీటర్ ఏసి బస్సును ఆదివారం నాడు విరాళంగా అందించింది.

సుమారు రూ. 35 లక్షల విలువైన ఈ బస్సును అశోక్ లేలాండ్ M&HCV అధ్యక్షుడు శ్రీ సంజీవ్ కుమార్ శ్రీవారి ఆలయం ముందు టిటిడికి అందజేశారు. సాధారణంగా ప్రతి ఏడాది అశోక్ లేలాండ్ కంపెనీ వారు టిటిడి కి ఒక ఆటోమొబైల్ వాహనాన్ని విరాళంగా అందిస్తుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, తిరుమల డిపో డిఐ శ్రీ వెంకటాద్రి నాయుడు  తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe