BB6 TELUGU CRIME NEWS : హైదరాబాద్: హైదరాబాద్ బాలానగర్‌లో విషాదం చోటుచేసుకున్నది. గంజాయి తనిఖీలకు వెళ్లిన ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో (Heart Attack) మరణించారు. బాలానగర్ పీఎస్‌లో ఎస్‌వోటీ కానిస్టేబుల్‌గా ప్రవీణ్ కుమార్ (38) విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారనే సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు తనిఖీలు వెళ్లారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుప్పకూలిపోయారు. గమనించిన సహచరులు ఆయనను దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి తనిఖీలకు వెళ్లి.. గుండెపోటుతో కుప్పకూలిన కానిస్టేబుల్

22
Jun