తెలంగాణా సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యంగా యావత్ జీవిత కాలాన్ని ఉద్యమంలో గడిపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయశంకర్ కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతు తెలంగాణా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషిచి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో తెలియచేస్తూ అనేక వ్యాసాలు, పుస్తకాలు రాసిన జయశంకర్ జీవితం మనందరికీ ఆదర్శమని అన్నారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, మహేష్, మల్లేష్, ఆదర్శ్, కటికరవి, ఖలీమ్, వెంకటకృష్ణ, ఉమేష్, రాజు, నరసింహ, అర్జున్, బాలకృష్ణ, బాగులు, రాజమని గౌడ్, శాంతమ్మ, బేగం తదితరులు పాల్గొన్నారు.
