Rain Alert: అలర్ట్.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. ఏపీ, తెలంగాణ లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

నైరుతి రుతుపవనాల విస్తరణ, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కరిసే అవకాశం ఉందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల వెదర్ అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. శుక్రవారం, శనివారం తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా.. ఈ రెండు రోజులు తెలంగాణలో అన్ని జిల్లాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఉష్ణోగ్రతలు..
శుక్రవారం తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 36.5, మహబూబ్ నగర్‌లో కనిష్టంగా 31 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఏపీ వెదర్ రిపోర్ట్..
ఇదిలాఉంటే.. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తున్నాయి.. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు, బాపట్ల మరియు పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe