ఆల్విన్ కాలనీ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభసందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు వారి కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో   నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe