మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామంలో కలెక్టర్ విజయేందిర బొయి ఆకస్మిక తనిఖీ

గండీడ్  మండలం సల్కార్ పేట గ్రామం లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జడ్.పి.హైస్కూల్, పూర్వ  ప్రాథమిక పాఠశాల(అంగన్ వాడి ) లను తనిఖీ చేసిన కలెక్టర్.విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  నాణ్యత తో అందించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బొయి ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమ శిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.గురువారం గండీడ్ మండలం సల్కార్ పేట గ్రామంలో  పర్యటించి  ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాలు, జడ్.పి.ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.

ప్రాథమిక పాఠశాల లో  1,2,3 వ తరగతి  గదులలో విద్యార్థుల బోధన పరిశీలించారు .3 వ తరగతి లో గణిత  కూడికలు గురించి బోధన చేస్తుండగా విద్యార్థుల వద్దకు వెళ్లి గణిత కూడికలు పరిశీలించారు.ఒకటవ తరగతి కి
వెళ్ళి ఇంగ్లీష్  లో A, B, C ,D  ఇంగ్లీష్  అక్షర మాల చదివించారు.ఇంగ్లీష్,తెలుగు అక్షరమాల ,గణిత ప్రాథమిక భావనలు, రోజూ కొత్త పదాలు నేర్పించాలని, బాగా చదివించాలని,వెనుకబడిన విద్యార్తులపై బాగా శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కాని విద్యార్థులను రెగ్యులర్ గా హాజరు అయ్యేలా చూడాలని అన్నారు.

ఎటువంటి ఫిర్యాదులు  రానివ్వద్దని సూచించారు.పాఠశాల పరిసరాలు పరిశుభ్రం గా ఉంచాలని  సూచించారు. అంగన్వాడీ ని తనిఖీ చేశారు. అంగన్వాడీ లోని  మధ్యాహ్నం భోజనం చేస్తున్న పిల్లలు ఆహారాన్ని పరిశీలించింది ఆహారంలో నాణ్యత లేకపోవడం వల్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. పప్పు చారు లాగా పలుచగా ఉందని .ఈరోజు గుడ్డు పెట్టారా ఎందుకు పెట్టలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.పిల్లలకు,గర్భిణీ ,బాలింతలకు పౌష్టిక ఆహారం,గుడ్లు సక్రమంగా అంద చేయాలని,వారి  పర్యవేక్షణ చేయాలని అన్నారు.అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తర్వాత జడ్.పి. ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను  కలెక్టర్ రుచి చూసి పరిశీలించారు. వెజిటేబుల్ కర్రీ  పలుచగా నీళ్ళ లాగా ఉండడం తో
కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందించాలని అన్నారు. తర్వాత స్టోర్ రూమ్ లో బియ్యం, ఆహార పదార్థాలు పరిశీలించారు. కార్యక్రమం లో తహశీల్దార్ బి.మల్లికార్జున రావు తదితరులు ఉన్నారు.

Related News

మహబూబ్ నగర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం  నాణ్యత తో అందించాలి.
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe