BB6 TELUGU NEWS CHANNEL
షాద్ నగర్ మున్సిపాలిటీ, అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి ఎమ్మెల్యే శంకర్ పిలుపు నిచ్చారు..షాద్ నగర్ మున్సిపాలిటీలో చివరి రోజూ సోమవారం ప్రచారం జోరుగా సాగింది.అటు కాంగ్రెస్ అభ్యర్థులు,ఇటు బీఆర్ఎస్ అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు.చివరి రోజు ఎమ్మెల్యే శంకర్ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి పథకాలను వివరించారు.28వ వార్డు అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మి గౌడ్ తో కలసి రోడ్ షో,ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.వార్డు అభివృద్ధి జరగాలంటే కాటం భాగ్యలక్ష్మి గౌడ్ ను గెలిపించాలని కోరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,,మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకుందాం అంటూ పిలుపునిచ్చారు.ప్రతి ఓటరును కలిసి ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఓటర్లకు వివరించాలని సూచించారు.ఈ ప్రచారంలో ఎమ్మెల్యే తో పాటు మహిళలు, కాలనీ వాసులు, యువకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
28వ వార్డులో అభ్యర్థి కాటం భాగ్యలక్ష్మి తో కలసి రోడ్ షో, ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్
10
Feb