వికారాబాద్ జిల్లాలో నాలుగు చైర్మన్ స్థానలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది మంత్రి శ్రీధర్ బాబు ,ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

BB6 TELUGU NEWS CHANNEL
వికారాబాద్ జిల్లా తాండూరు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూర్ మున్సిపల్ పరిధిలోని పాత తాండూర్, గాంధీ చౌక్ స్ర్టీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు, తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి , డీసీసీ అధ్యక్షులు ధారసింగ్ నాయక్ .

ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ…

మీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విద్యవంతులకు, యువకులకు, పార్టీ కోసం కష్టపడ్డ వారికీ పార్టీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు.

సామాజిక న్యాయం పాటిస్తూ బీసిలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

కాంగ్రెస్ పాలనలో పాత తాండూర్ కొత్త తాండూర్ కాబోతుంది.

రెండేళ్ళ పాలనలో ప్రతి కుటుంబంకు ప్రభుత్వం నుంచి ఏదో ఒక సంక్షేమ పథకం అందించడం జరిగింది.

గతంలో కరెంటు చార్జీలు పెరిగితే రోడ్లపై ధర్నాలు చేస్తే మన ప్రభుత్వంలో ఉచిత విద్యుత్ అందిస్తున్నాం

ప్రజాప్రభుత్వంలో దాదాపు 50 వేల పైగ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది.

త్వరలో ప్రభుత్వ ఉద్యోగలకు నోటిఫికేషన్స్ విడుదల.

నూతన రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పంపీణీ చేయడం జరుగుతుంది.

బీజేపీ – బిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ..

నేను మాటలు చెప్పను, శిలాఫలకాలు వేయను, పని చేసి చూయిస్తా.

తాండూర్ రాజకీయాలలో ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ సీట్ల కేటాయింపు జరిగింది.

సాంప్రదాయ రాజకీయాలకు చెక్ పెడుతూ కొత్తవారికి అవకాశం ఇచ్చాం.

కాంగ్రెస్ పార్టీ తరుపున  బరిలో ఉన్న అభ్యర్థులకు మీ ఇంటి బిడ్డగా భావించి ఓటేయ్యంటి.

తాండూర్ మున్సిపల్ కు రెండేళ్ల పాలనలో దాదాపు రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

చిలుక వాగు, గొల్లచెరువు, పాత తాండూర్ రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభించడం జరిగింది.

పాత తాండూర్ బ్రిడ్జి గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టం ఎక్కువ జరుగుతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తక్కువ మొత్తంలో నష్టం జరిగెట్లు డిజైన్ చేయడం జరిగింది.

బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్ల కోల్పోయిన బాధితులందరికీ ప్రభుత్వపరంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం.

తాండూర్ పట్టణంలో త్రాగునీటి ఎద్దడి నివారణకు కాగ్నా నది నుంచి అందించడానికీ ఇప్పటికే ప్రణాళికలు రూపొందించడం జరిగింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీఠ వేయడం జరిగింది.

తాండూర్ పట్టణంలో మహిళలకు దాదాపు రూ.15 కోట్లు వడ్డీ లేని రుణాలు అందించడం జరిగింది.

రెండేళ్ళ పాలనలో మున్సిపల్ ను చక్కబెట్టడం జరిగింది, మళ్ళీ దొంగల చేతికి ఇస్తే మున్సిపల్ ను సర్వనాశనం చేస్తారు.

దయచేసి ఆలోచించి, అభివృద్ధి కి, కాంగ్రెస్ కి ఓటు వేయాలని కోరుతున్నాను..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, పట్టణ నాయకులు, ఇంచార్జి లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe