BB6 TELUGU NEWS CHANNEL
ప్లేస్ ఏదైనా సరే విజయం మాదే అంటున్న కమ్మదనం గురుకుల అమ్మాయిలు.
*అస్మిత ఉమెన్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ అదరగొట్టిన కమ్మదనం క్రికెట్ టీమ్ అమ్మయిలు.*
*అమ్మయిలు అదుర్స్… ఆల్ రౌండర్ ప్రతిభతో కప్పు కైవసం.*
*ప్రిన్సిపాల్ శారద సహకారం మరువలేనిది:పీడీ అభిద్ హుస్సేన్ వెల్లడి.*
ఫరూక్ నగర్,
క్రికెట్ క్రికెట్ క్రికెట్ ఈ మాట వింటే మాములుగా మగవాళ్లే ఆడతారని చాలామంది అనుకుంటారు,కానీ మహిళలు కూడా ఆడతారని ఉహించలేరా?అందులోను చిన్న వయసులో ఉన్న అమ్మాయిలు,,,అయితే ఇక్కడ ఇదే జరుగుతుంది ఉదయమే మాట్లాడుకున్నాం కదా ఈ మధ్యన గురుకుల అమ్మాయిలు క్రీడలలో రాణిస్తూ మగవాళ్లకు కూడా అందనంత ఎత్తుకు పరుగులు తీస్తూన్నారు…కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు సోమవారం క్రికెట్ లో మరోసారి ప్రతిభ చూపి గెలిచారు.గెలవడమె కాదండోయ్ మరో వారం రోజుల్లో(ఫిబ్రవరి 8)న అహ్మదాబాద్ నగరం(గుజరాత్ స్టేట్)లో జరగబోయే పోటీలలో ఆడనున్నారు మన కమ్మదనం గురుకుల అమ్మాయిలు…కమ్మదనం గురుకుల సాంఘిక సంక్షేమ బాలికల విజయాలలో క్రికెట్ అసోసియేషన్ లో భాగస్వామ్యం పీడీ అభిద్ హుస్సేన్,పిటి నర్మద సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుండటం విశేషం..
అస్మిత ఉమెన్స్ టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ -2025 లో భాగంగా మారేడ్ పల్లి గ్రౌండ్,సికింద్రాబాద్ లో జరుగుతున్న పోటీలలో తెలంగాణ జట్టు తరపున కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల అమ్మాయిలు విజయం సాధించారు…ముఖ్యంగా కమ్మదనం సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపాల్ శారద మేడం ప్రోత్సహం,సహకారం వల్లనే నేడు అమ్మాయిలు తీరాలు దాటి విజయాలు గుప్పిట్లో పరుగులు పెడ్తున్నారని పీడీ అభిద్ హుస్సేన్ మీడియా ద్వారా అంటున్నారు..ప్రిన్సిపాల్ శారద సహకారం ఎప్పటికి గుర్తుండి పోతుందని సంతోషాన్ని పంచుకున్నారు…
*టీమ్ లో తెలంగాణ తరపున ఆడిన అమ్మయిలు పేర్లు.*
1.శ్వేత – ఆల్ రౌండర్
2.నిఖిత – ఆల్ రౌండర్
3.అక్షిత – ఆల్ రౌండర్
4.కృష్ణవేణి – ఆల్ రౌండర్
5.లోకేశ్వరి – బ్యాట్స్ మాన్
6.సెల్క్- బ్యాట్స్ మాన్
7.అనూష రాథోడ్ -ఆల్ రౌండర్
8.అనిత -ఆల్ రౌండర్
9.వైశాలి – బ్యాట్స్ మాన్
10.శ్రీనిధి – బ్యాట్స్ మాన్
11.హర్షిత,వర్ధిని(వికెట్ కీపర్),తెలంగాణ తరపున గెలిచి,చిరస్మరనియ విజయాన్ని అందించిన జట్టు సభ్యులను హెడ్ కోచ్ ఏం.నరేందర్ గౌడ్,పీడీ.నిరోజా లు అభినందించి,జట్టు సభ్యులకు షిల్డ్,మెమెంటో పాటు కప్ ను అందించారు.
మరో మైలు రాయి చేరుకున్న కమ్మదనం గురుకుల క్రికెట్ అమ్మాయిలు
03
Feb