F RTI నేతలు,పోలీస్ మరియు రెవిన్యూ డిపార్ట్మెంట్ శాఖ అధికారులుతో భేటీ

BB6 TELUGU NEWS CHANNEL
ఎఫ్ ఆర్ టి ఐ జాతీయ గౌరవ అధ్యక్షులు ప్రత్తిపాటి.చంద్రమోహన్,జాతీయ అధ్యక్షులు మట్టా.ప్రసాద్ సూచనల మేరకు,జాతీయ సంయుక్త కార్యదర్శి కుప్పాల.అజయ్ ప్రసన్న కుమార్  నేతృత్వంలో శనివారం తిరుపతి పట్టణ పోలీస్ డిపార్ట్మెంట్ డి ఎస్ పి కె.భక్తవత్సలo గారిని,వారి ఈస్ట్ పోలీస్ డివిజన్ కార్యాలయంలో ను,సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసులు గారిని, ఎస్ ఐ హేమాద్రి గారిని ఈస్ట్ పోలీస్ స్టేషన్ కేంద్రంలో సమావేశం అయ్యారు.తిరుపతి డిస్ట్రిక్ట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కార్యాలయంలో, ఆర్.వెంకట రత్నం,రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ గారిని, ఎస్.చంద్ర బాబు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ గారిని కలిసి సమాచార హక్కు చట్టం, హ్యూమన్ రైట్స్, లోకాయుక్త చట్టములతో తో కూడిన ఎఫ్ ఆర్ టి ఐ నూతన సంవత్సర క్యాలెండర్ అందించి,ప్రజలు అందరికీ పారదర్శకంగా,ఎక్కడా అవినీతి లేకుండా సేవలు అందేలా చూడాలని,అలాగే తమ ఆఫీసు సిబ్బంది అందరికీ, దిశా నిర్దేశం చేసి పబ్లిక్ కు మంచి సేవలు అందించాలని ఎఫ్ ఆర్ టి ఐ నేతల బృందం కోరటం జరిగింది.దానికి వారు స్పందిస్తూ ఆర్ టి ఐ యాక్ట్, మొదలగు చట్టాలను,స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మాధ్యమాల ద్వారా అవేర్నెస్ కల్పిస్తున్న, ఎఫ్ ఆర్ టి ఐ రిజిస్టర్డ్ సంస్థ,ఆర్ టి ఐ యాక్ట్ అవేర్నెస్ విరివిగా కల్పిస్తూ,నిజాయితీగా  గవర్నమెంట్ అధికారుల నుంచి కావలసిన సమాచారాన్ని సామాన్యులు కూడా ఎలా పొందాలి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం అభినందనీయం అని,భారతరాజ్యాంగo లోని, సహ.చట్టం నియమానుసారం తమ డిపార్ట్మెంట్ డిస్ప్లేబోర్డు ల ద్వారా, సహ.చట్టం ఫస్ట్ అప్పేలేట్ అధికారుల ఫోన్ నంబర్స్ కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతూ ప్రజలకు అందరికీ వన్ మంత్ లోపల, అత్యవసర సెక్షన్ 7(2) ప్రకారం 2 రోజుల్లోనే కూడా అందిస్తూ ఉండటానికి తాము సహకరిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కరాటే డి సి ఎస్ రాయల్ , తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి.వెంకట్, తిరుపతి పట్టణ కమిటీ అధ్యక్షులు జి.వేణు గోపాల్ పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe