విద్యార్థుల భవిష్యత్తు మనందరి ఏకైక లక్ష్యం.ప్రిన్సిపాల్ సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో “మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్”

ముఖ్య అతిధులుగా హాజరైన రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్.

భారీగా హాజరైన పేరెంట్స్,వక్తలు.

విద్యార్థుల భవిష్యత్తు మనందరి ఏకైక లక్ష్యం అని,అందుకోసం మనందరం కలసి వారి శ్రేయస్సు కోసం కృషి చేయాల్సిన అవసరం  ఎంతైనా ఉందని పిలుపు నిచ్చారు రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్,జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర రెడ్డి,వక్తలు…ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు షాద్ నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం కళాశాలలో నిర్వహించిన *”మెగా పేరెంట్స్..టీచర్స్ మీటింగ్”* సంబరాలు ఒక పండుగవాతావరణంలో జరిగాయి.ఈ కార్యక్రమానికి గాను రంగారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాధికారి వెంక్యా నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా పేరెంట్స్,విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,,,విద్యారంగంలో మరో వినూత్న ముందడుగు పడిందని అన్నారు.గతంలో కేవలం పాఠశాలల్లో మాత్రమే నిర్వాహించిన ఈ కార్యక్రమాన్ని జూనియర్ కళాశాలల వరకూ విస్తరించడం గమనార్హం అన్నారు.విద్యను డిజిటలిజషన్ చేస్తుందని,అందులో భాగంగానే ఇంటర్ విద్యతో పాటు విద్యార్థులకు ఆన్లైన్ లో,అకాడమీ క్లాస్సేస్,ఫిజిక్స్ వాలా క్లాస్సేస్, ప్రయోగ శాలలలో అన్ని వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.ప్రభుత్వ కళాశాలలో విద్య ప్రైవేట్ కళాశాల కంటే మెరుగైన విద్యను అందిస్తున్నారని తెలిపారు.ఈ మీటింగ్‌కి ఆహ్వానం విద్యార్థులే తమ తల్లిదండ్రులకు అందించడం,వారి భాగస్వామ్యాన్ని మరింత ప్రాధాన్యంతో చూపిస్తోందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.విద్యార్థులు,
కళాశాల కోసం తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను అభివృద్ధికి సూచనలు అందించవచ్చని కోరారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పేరెంట్స్ తో కలసి గ్రూప్ ఫోటో దిగారు.ఫరూక్ నగర్ తహ శిల్దార్ నాగయ్య,ఫరూక్ నగర్ మండల విద్యా అధికారి మనోహర్,శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సామ రవీందర్ రెడ్డి,షాద్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ జిల్లా పరిషత్ హైస్కూల్ (G) ప్రధానోపాధ్యాయురాలు పద్మా నళిని,గవర్నమెంట్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి,జిల్లా పరిషత్ (కో ఎడ్యుకేషన్)ఫిజిక్స్  ఉపాధ్యాయులు  రామచంద్ర,కళాశాల అధ్యాపక బృందం, వివిధ గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు భారి ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రిన్సిపాల్ సర్వేశ్వర రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేశారు…

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe