మానేరు హైలేవల్ బ్రిడ్జి టెస్ట్ ఫైల్ షురూ….

BB6 TELUGU NEWS CHANNEL
రూపు నారాయణపేట హై లెవెల్ బ్రిడ్జి టెస్టుఫైల్ పూజా కార్యక్రమం జరిగింది. వసంత పంచమి రోజైనా శుక్రవారం జరగడం విశేషం. పెద్దపెల్లి నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో భాగంగా శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేట -విలాసాగర్ గ్రామాల మధ్య నిర్మించి తలపెట్టిన మానేరు వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు  DNC నిర్మాణ కంపెనీ ఈ పనులు చేపట్టి పనులు జరిపిస్తూ మానేరులో మట్టి రోడ్డు నిర్మించి, వెంటనే ఈ టెస్ట్ ఫైల్, ( దిమ్మెల నిర్మాణం) ప్రారంభించడం హర్షనీయం. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజన్నకు అభినందనలు తెలిపారు. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక వంతెన నిర్మాణం. విజ్జన్న హయాంలో జరగడం మా పూర్వజన సుకృతమని కొనియాడారు. ఎమ్మెల్యేకు అందరూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో నూతనంగా ఎన్నికైన రూపునారాయణ పేట గ్రామపంచాయతీ నూతన కమిటీ సభ్యులు, సర్పంచ్ బొంగోని శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ స్వప్న సంతోష్, వార్డు మెంబర్లు మైలగాని శ్రీనివాస్, వంశీకృష్ణ, ఐలవేణి చెంద్రయ్య, తిప్పారపు వనజచిరంజీవి, ఈదమొగిలి, శారదవేంకటస్వామి, మాజీ ఎంపిటిసి నీర్ల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అంకం రమేష్, ఓదెల దేవస్థాన డైరెక్టర్ జీలుక రవి, మాజీ ఉపసర్పంచ్ రమేష్ ఆర్ అండ్ బి ఏ ఈ గుణశేఖర్, ప్రాజెక్టు మేనేజర్స్ మానస్ ముఖర్జీ, బి శోభన్, వర్క్ సూపర్ వైజర్లు, స్థానికులు లడే విజయరావు, చేలిక సాంబశివరావు, గజేల్లీ మొండయ్య, లడే శ్యాంరావ్, అరెల్లి కుమార్, గాజుల తిరుపతి, నీర్ల రాంచెందర్, గుర్రం పరశురాంలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe