సాంకేతిక యాజమాన్య గ్రామంగా అల్వాల గ్రామం ఎంపిక
BB6 TELUGU NEWS CHANNEL
కేశంపేట,ఆధునిక సాంకేతికతని రైతులలో పెంపొందించడానికి అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ శాఖ అధికారి శిరీష..బుధవారం రోజున మండల పరిధిలోని అల్వాల రైతు వేదికలో నీటి యాజమాన్య విభాగ శాస్త్రవేత్తలు రైతు వేదికలో సాంకేతిక యాజమాన్య సహకారంలో భాగంగా దత్తత గ్రామంగా అల్వాల గ్రామం ఎంపిక చేసుకోవడం జరిగింది.ఇందులో భాగంగా రైతులకు నర్సరీ కిట్లను అందించడం జరిగిందని మండల వ్యవసాయ శాఖ అధికారి శిరీష తెలిపారు.సుమారు 9 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.ఎంపిక చేసిన రైతులకు టమాటా విత్తనాలను,నర్సరీ ట్రేలని,కోకోపీట్ బస్తాలని ఉచితంగా అందించడం జరిగింది.ఈ ఎంపిక చేసిన రైతులు ఆధారంగా గ్రామంలో నీటి యాజమాన్య మరియు వ్యవసాయ ఆధునిక సాంకేతికతని రైతులలో పెంపొందించడానికి ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అదేవిధంగా కూరగాయల సాగు, ఆరుతడి పంటలను ప్రోత్సహించడం ద్వారా నీటి యాజమాన్యం సక్రమంగా జరిగి ఎకరాకి సాగయ్యే నీటితో దాదాపు రెండు ఎకరాల వరకు సాగు చేయవచ్చని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ మనోజ్ కుమార్,డాక్టర్ సురేష్,మండల వ్యవసాయ అధికారి శిరీష,అల్వాల గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి,డిప్యూటీ సర్పంచ్ మల్లేష్,వ్యవసాయ విస్తరణ అధికారి వినయ్,రైతులు పాల్గొనడం జరిగింది…
