తప్పుడు కేసు/FIR నమోదైతే ఏం చేయాలి? మనం ఇచ్చిన ఫిర్యాదుపై FIR నమోదు చేయని పోలీసులపై ఎలా కేసు వేయాలంటే..?

BB6 TELUGU NEWS CHANNEL
అకారణంగా లేదా పగతో ఎవరైనా మీపై తప్పుడు కేసు పెట్టినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. చట్టం మీకు రక్షణ కల్పిస్తుంది.

1. 👨‍⚖️ లీగల్ సెక్షన్ (విభాగం):
సెక్షన్ 482, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) / ఇప్పుడు సెక్షన్ 528, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS):
ముఖ్య ఉద్దేశం: హైకోర్టుకు ఉన్న అంతర్లీన అధికారాలు (Inherent Powers). తప్పుడు ఎఫ్ఐఆర్ (FIR) ను రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది.
సాధారణ అర్థం: మీపై అక్రమంగా కేసు పెట్టారని మీరు నిరూపించగలిగితే, హైకోర్టు ఆ కేసును కొట్టివేస్తుంది (Quash).

2. 📋 ప్రజలకు అర్థమయ్యే పాయింట్లు:
అరెస్టు నుండి రక్షణ: మీరు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినప్పుడు, విచారణ పూర్తయ్యే వరకు మిమ్మల్ని అరెస్టు చేయకుండా స్టే (Stay) కోరవచ్చు.
ఆధారాలు సేకరించండి: ఎదుటి వ్యక్తి పెట్టిన కేసు తప్పు అని నిరూపించడానికి మీ వద్ద ఉన్న కాల్ రికార్డింగ్స్, వీడియోలు లేదా సాక్ష్యాలను భద్రపరుచుకోండి.
ముందస్తు బెయిల్: ఒకవేళ అరెస్టు అయ్యే అవకాశం ఉందని భావిస్తే, సెక్షన్ 438 (CrPC) / సెక్షన్ 482 (BNSS) కింద ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

3. 🧑‍💻 జూనియర్ అడ్వకేట్‌లకు ముఖ్య అంశం:
క్వాషింగ్ గ్రౌండ్స్ (Grounds for Quashing): ఎఫ్ఐఆర్ లో ఉన్న ఆరోపణలు ప్రాథమికంగా (Prima facie) ఎటువంటి నేరాన్ని నిరూపించలేకపోయినా, లేదా ఆ విచారణ కేవలం పిటిషనర్ ను వేధించడానికే అని కోర్టు భావిస్తే క్వాష్ పిటిషన్ అనుమతించబడుతుంది.

4. 📜 ప్రముఖ జడ్జిమెంట్ (తీర్పు):
శీర్షిక: స్టేట్ ఆఫ్ హర్యానా vs. భజన్ లాల్ (State of Haryana vs. Bhajan Lal)
తీర్పు నంబర్: 1992 Supp (1) SCC 335
సారాంశం: తప్పుడు ఎఫ్ఐఆర్ లను ఏ పరిస్థితుల్లో రద్దు చేయవచ్చో సుప్రీంకోర్టు ఈ కేసులో 7 ముఖ్యమైన మార్గదర్శకాలను ఇచ్చింది.

మనం ఇచ్చిన ఫిర్యాదుపై FIR నమోదు చేయని పోలీసులపై ఎలా కేసు వేయాలంటే..?

మనమిచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయని పోలీసులపై ఎలాంటి చర్యలు ఉంటాయి..?

కోర్టులో పోలీసులపై ఏ విధమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయొచ్చు. ఇలాంటి కేసులు కోర్టులో పరిష్కారం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతాయి.. ఒక వేళ ఆలస్యం అయితే సామాన్యులు ఏం చెయ్యాలి.. ఇలాంటి సందేహాలు మీకు ఉన్నాయి. అయితే ఈ కథనం మీకోసమే.

Law Tips: ఏదైనా తప్పు జరిగిన సమయంలో మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సహజం.. అయితే అలా వెళ్లి ఫిర్యాదు చేసిన తరువాత కూడా.. పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదా..? అయితే ఇలా చేయండి..

మనకు జరిగిన అన్యాయానికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో ” ఎఫ్ఐఆర్” నమోదు చేయించడం ఎలా…. ఒకవేళ మనం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలి… పూర్తి వివరాలు ఇవే…ఏదైనా తప్పు జరిగిన సమయంలో మనం వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కూడా పోలీసులు నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయని పక్షంలో సంబంధిత పోలీస్ స్టేషన్ పై అధికారులు కానీ. ఆ జిల్లాకు సంబంధించిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీకి కానీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చు ఒకవేళ ఎస్పీ మనం ఇచ్చిన ఫిర్యాదు పై యాక్షన్ తీసుకోకపోతే నేరానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో సహా మనం ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించని పోలీసులపై కూడా కోర్టులో జడ్జి గారికి కంప్లైంట్ చేయవచ్చు అది ఎలాగో తెలుసుకునేందుకు పూర్తిగా చదవండి..

1. cognizable affences( గుర్తించదగిన నేరాలు ) కాగ్నైజబుల్ అఫెన్సెస్ అంటే ఏదైనా నేర తీవ్రత ఎక్కువ ఉన్న దానిని కాగ్నిజబుల్ అఫెన్సెస్ అని అంటారు మనం గుర్తించదగిన నేరాన్ని బట్టి పోలీస్ స్టేషన్లో మనం ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించవచ్చు లేదా ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు నేర తీవ్రత ఎక్కువ ఉన్న కేసులో ఎటువంటి జడ్జిమెంట్ కోసం వేచి చూడకుండానే నేరస్తుడిని ఇన్వెస్టిగేషన్ చేయవచ్చు.

2. Non cognizable affences ( గుర్తించలేని నేరాలు )

నాన్ కాగ్నైజబుల్ గుర్తించలేని నేరాలన్నీ ఈ నాన్ కాగ్నిజబుల్ కిందకి వస్తాయి ఇందులో నేర తీవ్రత తెలియని సమయంలో నిందితుడు ఆ తప్పు చేశాడా లేదా బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అది నిజమా అబద్దమా అని అయోమయ స్థితిలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని కోర్టులో జడ్జి ముందు హాజరు పరిచి తీర్పు తీర్పు ఆధారంగా నిందితుడిని ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించవచ్చు

ఇక మనం ఇచ్చిన ఫిర్యాదుని పోలీసులు రిజిస్టర్ చేయకపోతే నిందితుడిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయకపోతే ఆ సందర్భంలో రెండు విధాలుగా పోలీసులపై ఫిర్యాదు చేయవచ్చు ఒకటి ఇంటర్నల్ డైమెన్షన్ రెండవది ఎక్స్టర్నల్ డైమెన్షన్. ఇంటర్నల్ డైమెన్షన్ సెక్షన్ 154 అండర్ CRPC అనే సెక్షన్ల కింద మనం ఏదైతే స్టేషన్లో పోలీస్ ఎస్ఐకి కానీ సీఐకి కానీ ఫిర్యాదు చేసిన సమయంలో వారు ఎఫ్ఐఆర్ నమోదు చేయని యెడల వారిపై 154 సెక్షన్ కింద ఆధారాలతో సహా సంబంధిత పై అధికారి అయిన ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
ఒకవేళ ఎస్పీ సైతం మనం ఇచ్చిన ఫిర్యాదు తీసుకొని దానిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెక్షన్ 200,190 సబ్ సెక్షన్ క్లాస్ \”ఏ \” అనే సెక్షన్లతో కూడిన ఫిర్యాదు ఆధారాలతో సహా కోర్టులో జడ్జి ముందు సమర్పించి నాకు జరిగిన అన్యాయానికి సంబంధించి నేను పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోలేదు దానికి సంబంధించిన ఆధారాలతో సహా పోలీసులు నా కంప్లైంట్ ను స్వీకరించలేదని ఎస్పీ కి కూడా తెలిపితే ఎస్పీ కూడా దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని కోర్టులో పోలీసులపై జడ్జికి కూడా కంప్లైంట్ చెయ్యొచ్చు…..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe