BB6 TELUGU NEWS CHANNEL: గండీడ్ మండలం బైస్ పల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గోరెంక చెన్నయ్యకు మహబూబ్ నగర్ జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు దోమ వెంకటేష్ బుధవారం చార్జింగ్‌తో నడిచే ట్రైసైకిల్‌ను అందించారు. లింగాయపల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి ఆయనకు మానవతా దృక్పథంతో అందజేసినట్లు వివరించారు. వైకల్యం కారణంగా దైనందిన జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న చెన్నయ్యకు ఈ ట్రైసైకిల్ జీవనాధారంగా మారనుందని స్థానికులు పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయానికి మాత్రమే పరిమితం కాకుండా, సమాజంలో అవసరమున్న వారికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని గ్రామ పెద్దలు వెంకటేష్ ను అభినందించారు. ముఖ్యంగా చార్జింగ్ విధానంలో పనిచేసే ఈ ట్రైసైకిల్ ద్వారా చెన్నయ్య స్వతంత్రంగా తన పనులు నిర్వహించుకునే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ, తనకు ఈ సహాయం అందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన జీవితంలో ఇది ఒక మరిచిపోలేని సహాయమని అన్నారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మంది ముందుకు వచ్చి చేయాలని, పేదలు–వికలాంగుల సంక్షేమానికి సమాజం భరోసాగా నిలవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు దోమ వెంకటయ్య,రాములు,అంజి ,ప్రవీణ్ కుమార్ బాబు ,గోపాల్ ,వెంకటయ్య,దోమ వెంకటయ్య, భీమయ్య ,నారాయణ,మొగులయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుడు చెన్నయ్యకు చార్జింగ్ ట్రైసైకిల్ అందజేత
14
Jan