వికారాబాద్ జిల్లా జాతీయ బిసి జనసేన అధ్యక్షుడిగా కలేతీ మదన్ కుమార్

BB6 TELUGU NEWS CHANNEL
రాష్ట్ర జాతీయ బీసీ జనసేన  అధ్యక్షుడు కత్తి చంద్రశేఖర అప్ప ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య  ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా జనసేన అధ్యక్షులుగా అధికార పూర్వకంగా కలేతి మదన్ కుమార్ నియమించడం జరిగింది. బీసీల ఐక్యతకై, అభివృద్ధికై, అధికారానికై ఒక మంచి నాయకుడు కావాలని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలల్లో నిత్యం తోడు ఉండే ప్రజానాయకుడుగా పేరు పొందిన మదన్ కలేతి  ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మదన్ కుమార్ మాట్లాడుతూ ఈ బీసీ ఉద్యమాన్ని ఒక విప్లవంగా భావించి కులాలకి పార్టీలకి అతీతంగా సమానత్వం కల్పిస్తూ సమర్థవంతంగా బీసీ వర్గం అభివృద్ధి చెందే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని మదన్ కలేతి  తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు చంద్రశేఖర అప్ప  జిల్లా మహిళా అధ్యక్షులు కాటం భాగ్యలక్ష్మి గౌడ్  జిల్లా అధ్యక్షులు బోయ చెన్నయ్య  గౌరవ అధ్యక్షులు మేకల వెంకటేష్ ముదిరాజు  గద్దమీది రమేష్ , బీసీ జన సేన అధికార ప్రతినిధి జక్కుల స్రవంతి, ముదిరాజ్  నియోజకవర్గం మహిళా ఉపాధ్యక్షురాలు అరుణ గౌడ్ , టౌన్ అధ్యక్షులు రాములు గౌడ్, ప్రధాన కార్యదర్శి సుకన్య, చారి , శ్రీధర్ ,వర్మ ముదిరాజు సోషల్ మీడియా కన్వీనర్ ఎస్ బి బాలు పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe