హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు

నేడు తెలంగాణ హైకోర్టులో ప్రభాస్, చిరంజీవి సినిమాల టికెట్ రేట్ల పెంపుపై విచారణ.. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్ర నిర్మాతలు.. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీలు దాఖలు చేసిన నిర్మాతలు.. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన నిర్మాతలు..

BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: ప్రభాస్ రాజా సాబ్,చిరంజీవి మన శంకరవరప్రసాద్ చిత్రనిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా టికెట్ ధరలపెంపు, అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో అప్పీల్ పిటిషన్ ధఖలు చేశారు. కాగా, టికెట్ ధరలు పెంచకుండా, అదనపు షోలకు అనుమతి కల్పించకుండా గతంలో హైకోర్టు సింగిల్బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచు ఆశ్రయించారు రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ చిత్ర
నిర్మాతలు.

సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేసి టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. టికెట్ధరల పెంపు, ప్రత్యేక షోల కోసం ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శికి దరఖాస్తు చేసినట్లు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఆ విజ్ఞప్తిని పరిశీలించేలా హోంశాఖ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ను అత్యవసర పిటిషన్ కింద విచారణకు స్వీకరించాలని నిర్మాతల తరపు న్యాయవాదులు కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. బుధవారం(జనవరి 7) ఈ పిటిషన్లపై విచారణ చేపడతామని తెలిపింది హైకోర్టు.సినిమాల విడుదలకు మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. రాజా సాబ్ టికెట్ రేట్ ఎంతంటే..? ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. జనవరి 8న రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఆ ప్రీమియర్ షో టికెట్ను.. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయలు (జీఎస్టీ అదనం),మల్టీప్లెక్స్ ల్లో 1000 రూపాయలకు (జీఎస్టీ అదనం) అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ తెలంగాణ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది.అంతే కాకుండా.. జనవరి 9న తెల్లవారుజామున 4 గంటల షోకు కూడా అనుమతి ఇవ్వాలని కోరింది. అంతేకాకుండా.. డే1 నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెగ్యులర్ టికెట్ ధరపై 102 రూపాయల పెంపును, మల్టీప్లెక్స్ టికెట్ధరపై 132 రూపాయల పెంపునుz కోరుతూ ‘ది రాజా సాబ్’ సినిమా నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం గమనార్హం. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రికి, హోం శాఖస్పెషల్ చీఫ్ సెక్రటరీకి ఈ లేఖ రాశారు. అయితే.. జనవరి 4న ఈ లేఖ రాసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికైతే స్పందన లేదు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే.. రాజా సాబ్ ప్రీమియర్ షో ధర సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 800 రూపాయల పైమాటే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe