BB6 TELUGU NEWS CHANNEL
ఉమ్మడి గండీడ్ మండలంలోని భారతీయ జనతా పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి –
డా వెన్న ఈశ్వరప్ప బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబీసీ మోర్చా.
మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి వచ్చే ప్రతి పైస మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది.
మన గ్రామాలలో రోడ్లు, డ్రైనేజ్, ఎలెక్ట్రికల్ లైట్లు, రైతు వేదికలు, స్మశావాటికలు, మొక్కలు నాటడం, త్రాగు నీటి వసతి కోసం బోర్లు వేయడం ప్రతీ అభివృద్ధి పనీ కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుచున్నది
అలాగే కేంద్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్క ఇంటిలోని కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికీ 6 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం, రైతులకు ఏకరాకు రూ 6,000లు, ఎరవులలో అధికంగా సబ్సిడీ, గ్యాస్ సిలిండర్లలో సబ్సిడీ, అన్ని వర్గాలకు సబ్సిడీలతో బ్యాంకుల ద్వారా లోన్స్, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ వ్యవసాయ కూలీలకు పని గ్యారంటీ ఇలా అనేకమైన కేంద్ర పథకాల ద్వారా ప్రతి ఒక్కరూ అభివృధి కొరకు మన భారత దేశ ప్రధనమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ద్వారా అహర్నిశలు కృషి చేస్తున్నారు.
మన గ్రామానికి మన కుటుంబాలు బాగుపడెందుకు ఇంకా ఏదైనాసరే వచ్చే ప్రతి పైస అన్ని మోడీ BJP ప్రభుత్వమే ఇస్తుంది.
మన భారత దేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలుపుతు మన దేశ కీర్తి ప్రతిష్ట పెంచుతూ, మనందరినీ కాపాడుతున్న మోడీకి కృతజ్ఞతా భావంగా BJP పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను స్థానిక ఎన్నికలల్లో మన మండలంలో ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో మీ అమూల్యమైన ఓట్లను వేసి అత్యధిక సంఖ్యలో గెలిపించాలని మన డా వెన్న ఈశ్వరప్ప ఉమ్మడి గండీడ్ మండల వాసి గండీడ్ మండలం, మహమ్మదాబాద్ మండలంలోని ప్రజలందరినీ అభ్యర్థించారు.
ఉమ్మడి గండీడ్ మండలంలోని bjp పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి – డా వెన్న ఈశ్వరప్ప
09
Dec