సర్పంచ్ పదవి కోసం హడావుడిగా ‘ఎస్సీ మహిళ’తో పెళ్లి.. సీన్ మెుత్తం రివర్స్, ఎంత పనైపాయే మావా..!

BB6 TELUGU NEWS CHANNEL
సర్పంచ్ పదవి కోసం ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయిన స్థానాన్ని దక్కించుకోవడానికి అతను ఒక ఎస్సీ మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే.. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఓటరు జాబితాలో ఆమె పేరు చేర్చడానికి గడువు ముగియడంతో అతని ప్రణాళిక బెడిసికొట్టింది.

రాజకీయాల్లో కొన్నిసార్లు చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. కొందరు పదవి కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తుంటారు. అయినా.. తమ కోరిక మాత్రం తీర్చుకోలేక సన్యాసం తీసుకుంటారు. ఇంకొందరు పట్టిందల్లా బంగారం అయినట్లు కోరుకోని పదవులు కూడా వచ్చి వరిస్తుంటాయి. తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ కారణంగా వికారాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓకే కుటుంబానికి మూడు పదవులు వచ్చాయి. ఆ గ్రామం సర్పంచ్ ఎస్టీ రిజర్వ్‌డ్ కాగా.. ఒక్కటే ఎస్టీ కుటుంబం ఉండటంతో కోరుకోకున్నా పదవి వరించింది.

అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. రాజకీయలపై ఆశ, సర్పంచ్ కావాలనే కోరిక ఓ వ్యక్తి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసింది. ఈ ఘటన గంగాధర మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని ఓ గ్రామంలో సర్పంచి స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్ అయింది. ఆ గ్రామంలో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ.. అవివాహితుడైన ఒక వ్యక్తి ఈ రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకోని సర్పంచ్ పదవిని దక్కించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe