BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్ లో నకిలీ లేడీ కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఉద్యోగంరాకున్నా.. ఏం చక్కగా ఖాకీ డ్రెస్ వేసుకుని కానిస్టేబుల్ గా చలామణీ అవుతూ డైలీ ఉద్యోగం చేస్తోంది ఓ యువతి.సెక్రటేరియట్ లలో ఉన్నతాధికారులతో మీటింగ్ లకు, వీఐపీ మీటింగ్ లకు సైతం హాజరవుతోంది. ఇలా నకిలీ కానిస్టేబుల్‌గా తిరుగుతోన్న ఓయువతి వ్యవహారం నవంబర్ 21న బట్టబయలైంది.
అసలేం జరిగిందంటే..?పోలీసులుచెప్పిన వివరా ప్రకారం.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఉమాభారతి(21)అనే యువతి నకీలీ ఖాకీ కానిస్టేబుల్ గా అవతారమెత్తింది. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో ఖాకీ డ్రెస్ కొనుక్కుని డ్యూటీలు చేస్తోంది ఉమాభారతి. షాపూర్నగర్ కు చెందిన ఉమాభారతి డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు జీడిమెట్ల పోలీసులు. గతంలో విఐపీ మీటింగ్ లతో పాటు సెక్రటేరియట్,సైబరాబాద్ సీపీ ఆఫీస్ లల్లో మీటింగ్ లకు సైతం హాజరైనట్లు చెప్పారు. నవంబర్ 21న సైబరాబాద్ సీపీ ఆఫీస్ క్యాంటీన్ లో నకిలీ కానిస్టేబుల్ టిఫిన్ తింటుండగా ఉన్నతాధికారులకు అనుమానం వచ్చి ఆరాదీశారు. దీంతో అసలు భాగోతం బయటపడింది.యువతిని అరెస్ట్ చేసిన మాచాపూర్ పోలీసులు జీడిమెట్ల పీఎస్ కు కేసును అప్పగించారు.
హైదరాబాదులో నకిలీ లేడీ కానిస్టేబుల్..ఖాకీ డ్రెస్ వేసుకుని ఉన్నతాధికారులు, వీఐపీ మీటింగ్ కు హాజరు
22
Nov