iBomma వెనుక మాస్టర్ మైండ్ వైజాగ్ వాసి.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు.. ఇంత నెట్వర్క్ నడుపుతున్నాడా ? ఇమ్మడి రవి (IMMADI RAVI).. ఇపుడు టాలీవుడ్ లోనే కాదు.. సినీప్రేక్షకుల్లో వినిపిస్తున్న పేరు. పైరసీ వెబ్ సైట్ Ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇవాళ (2025 నవంబర్15న) కూకట్ పల్లి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఇమ్మడి రవిని మరి కాసేపట్లో హైదరాబాద్ నాంపల్లి కోర్టకు తరలించారు.
BB6 TELUGU NEWS CHANNEL
హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
రవి గతంలోనే పోలీసులకు, సినీ పరిశ్రమకు ఛాలెంజ్ విసురుతూ, తనపై చర్యలు తీసుకుంటే అందరి జీవితాలు “బట్టబయలు చేస్తా” అని బెదిరింపులకు దిగినట్లు పోలీసులు వెల్లడించారు. తన వెబ్‌సైట్‌పై దాడి చేస్తే, పరిశ్రమతో పాటు పోలీసుల వ్యక్తిగత వివరాలను బయట పెడతానని కూడా రవి బ్లాక్‌మెయిల్ చేసినట్టు సమాచారం.
గత 6 నెలలుగా రవిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు నిర్వహిస్తున్నాయి. చివరకు అతని ప్రయాణ సమాచారం ఆధారంగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
పైరసీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు రవి దాదాపు రూ. 3,000 కోట్ల నష్టం కలిగించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తగా విడుదలైన సినిమాలను కొన్ని గంటల్లోనే HD ప్రింట్‌గా పైరసీ చేసి ఐబొమ్మలో అప్‌లోడ్ చేస్తున్న ప్రధాన వ్యక్తి రవేనని పోలీసులు పేర్కొన్నారు.