BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం రంగారెడ్డి పల్లి గ్రామ సమీపాన పైప్లైన్లు పగిలి రెండు నెలలుగా నిలిచిపోయిన నీటి సరఫరా.దాహార్తితో 9 గ్రామాలు. భారీ వర్షాల కారణంగా రంగారెడ్డి పల్లి వాగులో కొట్టుకుపోయిన పైప్లైన్లు . దీని కారణంగా తొమ్మిది ఊర్లకు ఆగిపోయిన మిషన్ భగీరథ మంచినీళ్లు. కాలువలో నీళ్లు తగ్గుముఖం పడితేనే మరమ్మత్తులకు వీలవుతుందని రెండు నెలలు కాలయాపన చేశారు.
ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు చూస్తున్నాం .
DE.venkatesh
అధికారులకు ఎంత మొరపెట్టుకున్నా ముద్దు నిద్రపోతున్న పాలకవర్గం అని చేతకాని ప్రతిపక్షాలని ప్రజలు చి కొడుతున్నారు. గండీడ్ మండలానికి సంబంధించిన..
రంగారెడ్డి పల్లి
గోల్లగడ్డ
కపులాపురం
జానంపల్లి
గోవిందపల్లి
గోవిందపల్లి తాండ
వెన్నచెడ్
లింగాయపల్లి గ్రామాలకు నిలిచిపోయిన నీటి సరఫరా. గతంలో రెండు లక్షలు ఎస్టిమేషన్ ఉందని కలెక్టర్ గారి దృష్టికి రాగా వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సంబంధిత అధికారులను హెచ్చరించారు. గండీడ్ ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లిన ఫలితం శూన్యం. మంచినీళ్లు లేక ఇక్కట్లు పడుతున్న జనాలకు పార్టీ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.