BB6 TELUGU NEWS CHANNEL, హైదరాబాద్: స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో వినియోగదారులు తమ సెల్ఫోన్లోనే కరెంటు మీటర్ రీడింగిని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చని… నెలవారీ బిల్లు పెరగకుండా పొదుపు పాటించడానికి అవకాశం ఏర్పడుతుందని ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీవ్యవస్థను ఆధునికీకరించి… ‘సరఫరా, పంపిణీ'(టీడీ) లోనష్టాలను తగ్గించడానికి చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సంస్థల పనితీరు, పంపిణీ వ్యవస్థలో సమస్యలు, ప్రభుత్వపరంగా చేపడుతున్న సంస్కరణలు తదితర అంశాలను వివరించారు.
ఆయన మాటల్లోనే….’పీఎం సూర్యఘర్’ పథకంలో తెలంగాణ వెనుకబడటానికి ఇళ్లపై సౌరవిద్యుత్ ఏర్పాటును డిస్కంలు ప్రోత్సహించకపోవడమే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి…?ఇందులో వాస్తవం లేదు. రాష్ట్రంలోని గృహావసర కనెక్షన్లలో 80% వరకు నెలకు 200 యూనిట్లలో పేకరెంటు వినియోగిస్తున్నారు. ఈ వినియోగదారుల్లో |ఎక్కువ మంది గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్ పొందుతున్నారు. రూ. లక్ష వరకు ఖర్చుతో రూప్టాప్| సోలార్ పలకల ఏర్పాటుకు వీరు విముఖత చూపుతున్నారు. రూల్స్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకుంటే రాయితీ వస్తుందని, కరెంటు బిల్లు తగ్గుతుందంటూ గృహజ్యోతి పరిధిలో లేని వినియోగదారులకు సెల్ఫోన్ సందేశాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఆసక్తికనబరిచే వారికి ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా రూల్స్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహకరిస్తున్నాం. ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని గతంలో ఈఆరీ ఆదేశించింది. ఎప్పుడు ఏర్పాటు చేస్తారు…?పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కేటగిరీల్లో కరెంటు వినియోగం భారీగా ఉంటుంది. అందుకే ప్రస్తుతం వాటికి ఇచ్చే కొత్త కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును తప్పనిసరి చేశాం. ఈ మీటర్లలోనే ప్రీపెయిడ్ ఆప్షన్ ఉంటుంది. గృహావసరాలకు దశల వారీగా ఏర్పాటు చేస్తాం. ప్రీపెయిడ్ మీటర్లతో సాంకేతిక సమస్యలు వస్తున్నట్లు పలు రాష్ట్రాల విద్యుత్ అధికారులు చెబుతున్నారు. రీఛార్జి సొమ్ము వరకు కరెంటు వాడుకున్న తర్వాత సరఫరా నిలిచిపోతుంది. తిరిగి రీఛార్జి చేసుకున్నాకే సరఫరా ప్రారంభమవుతుంది.
ఇలాంటి సాంకేతిక సమస్యలను పరిశీలించి… ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. నెలకు 500 యూనిట్లకుపైగా వినియోగించుకునే వారు కోరితే ఏర్పాటు చేస్తాం.కాలం చెల్లిన పరికరాలు, సామగ్రి వల్లనే విద్యుత్పంపిణీలో 10 శాతానికి పైగా నష్టాలు వస్తున్నాయన్నది.?
రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి విద్యుత్ పంపిణీ వ్యవస్థ| పరికరాలు, సామగ్రి మార్చేయడం సాధ్యం కాదు. ఒకే ఫీడర్లో మొత్తం పరికరాలు, సామగ్రి మార్చాలంటే 10-15 సార్లు కొన్ని గంటలసేపు సరఫరా నిలిపివేయాల్సి ఉంటుంది. పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణకు ఈ ఏడాది రెండు డిస్కంల పరిధిలో రూ.4 వేల కోట్ల వరకు వెచ్చించాలనే ప్రణాళికలున్నాయి. ఉత్తర డిస్కం పరిధిలోరూ.450 కోట్లతో పనులు చేపడుతున్నాం.ఉత్తర డిస్కం పరిధిలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయెందుకు?
బొగ్గు ధరలు పెరుగుతుండటంతో కరెంటు కొనుగోలు వ్యయం అధికంగా ఉంది. పంపిణీ, సరఫరాలో నష్టాలను గణనీయంగా తగ్గించడానికి పెద్దఎత్తున సంస్కరణలు అమలు చేస్తున్నాం. సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో తిరుగుతూ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను,లైన్లను పరిశీలిస్తున్నాను. ఏదైనా ఫీడర్ పరిధిలో బిల్లులు, రీడింగ్లో తేడాలు అధికంగా ఉంటే ఇంజినీర్లను తనిఖీలకు పంపుతున్నాను.
కొత్త డిస్కం ఏర్పాటుతో ప్రయోజనాలేంటి?రాష్ట్రంలో మూడో డిస్కం ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. త్వరలో దీనిపై స్పష్టత రానుంది. కొత్తడిస్కం పరిధిలోకి వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా, ఎత్తిపోతల పథకాలు వంటివి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మూడో డిస్కం ఏర్పాటుతో ప్రస్తుతమున్న రెండు డిస్కంలకు నష్టాలుతగ్గి.. ఆర్థికంగా మేలు జరుగుతుందని అంచనా.
కొత్త కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ..
తొలుత పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల్లో ఏర్పాటు..పంపిణీ వ్యవస్థ ఆధునికీకరణతో నష్టాలను తగ్గిస్తాం’ ఉత్తర డిస్కం సీఎండీ వరుణ్ రెడ్డి
03
Nov