BB6 TELUGU NEWS CHANNEL
బిజెపి చరిత్రలోనే సరికొత్త రికార్డు! జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 50 శక్తి కేంద్రాలలో ఒక్కరోజే భారీ ఎత్తున పాదయాత్ర జరిగింది.ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో బిజెపికి ఉన్న ఆదరణను ఈ యాత్ర నిరూపించింది.
ప్రతి శక్తి కేంద్రానికి ముగ్గురు ముఖ్యనాయకుల చొప్పున కేంద్ర మంత్రులను, పార్లమెంట్ సభ్యులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీల, రాష్ట్ర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో అన్ని భూత్ లను కలుపుతూ భారీ వర్షాన్ని లెక్క చెయ్యకుండా పెద్ద ఎత్తున పాదయాత్ర ఇంటింటికీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ బీజేపీ పార్టీ కి మద్దతు తెలపాలని, కమలం పువ్వు గుర్తుకు ఓట్ వేయాలని ప్రచారం చేయడం జరిగినది. ఆయా ప్రాంతాల నాయకులు, ప్రజలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల స్పందన చాలా బాగా వున్నది.
అందులో భాగంగా గౌరవనీయులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖామాత్యులు శ్రీనగర్ డివిజన్లోని ఎల్లారెడ్డిగూడ శక్తి కేంద్రం పరిధిలో పాదయాత్ర నిర్వహించారు.
శ్రీనగర్ డివిజన్లోని నవోదయ కాలనీ శక్తి కేంద్రంలో గౌరవనీయులు శ్రీ బీబీ పాటిల్ గారు, మాజీ ఎంపి, జహీరాబాద్ డా.తుట్పల్లి రవికుమార్ గారు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి, శ్రీ కెవిఎల్ఎన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మన ప్రియతమ నేత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ఓబిసి మోర్చా, శ్రీనగర్ డివిజన్ ఇంచార్జ్ డా.వెన్న ఈశ్వరప్ప గారు మన పరిగి నియోజక వర్గానికి వన్నె తెచ్చే విధంగా ఈ ముఖ్య నాయకులకు స్వాగతం పలికి, పాదయాత్రలో ప్రజలతో కలిసి మమేకమయ్యారు.
ఈ పాదయాత్ర సాయంత్రం 4:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు నవోదయ కాలనీ, శ్రీనగర్ కాలనీ డివిజన్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ ప్రాంతాలలో ఈ పాదయాత్ర దిగ్విజయంగా జరిగినది.
పాదయాత్రలో భాగంగా ప్రజల వద్దకు చేరి అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం బిజెపి పార్టీకి చెందిన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి పార్టీ అభ్యర్థి శ్రీ లంకల దీపక్ రెడ్డి గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది.దీనికి ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ముందుకొచ్చి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ పరిధిలో కమల ప్రభంజనం మొత్తం 50 శక్తి కేంద్రాల్లో చారిత్రక పాదయాత్ర
29
Oct