ధాన్యం లారీలకు డబ్బులు డిమాండ్ ముగ్గురు మీడియా ప్రతినిధులపై కేసు నమోదు |

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్ నగర్ జిల్లా లో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలను అడ్డుకొని డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో ముగ్గురు మీడియా ప్రతినిధులపై మహబూబ్ నగర్ లో కేసు నమోదైంది. మహబూబ్నగర్ రూరల్ ఎస్సై విజయకుమార్ కథనం ప్రకారం.. మంచిర్యాలజిల్లా నుంచి మూడు ధాన్యం లారీలు కర్ణాటక రాష్ట్రం రాయచూరు వెళ్తున్నాయి. మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం ఎదిర బైపాస్ రోడ్డులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు వీటిని ఆపి డబ్బులు డిమాండ్చేశారు . లారీకి రూ.2 లక్షల చొప్పున రూ. 6 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు డ్రైవర్ మహ్మద్ సాజిద్ ఆహ్మద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీఎన్ఎస్ 126, 308 సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe