BB6 TELUGU NEWS CHANNEL
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. మరియు పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి బీసీ సంఘాల ఆదేశాల మేరకు చౌడాపూర్ మండల కేంద్రంలో బీసీ సంఘాల జేఏసీ నాయకులు కాంగ్రేస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తూ నిర్వహించిన బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా చౌడపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్ మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, బీసీ వర్గాల సామాజిక న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారుజనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే బీసీల న్యాయమైన డిమాండ్‌కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందిబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి తీరుతామన్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనేది రాహుల్ గాంధీ కల అని,రిజర్వేషన్లు సాధించేందుకు ఎంతటి పోరాటమైనా చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు బీసీ సంఘాల నాయకులుజేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్పటి ఆశోక్ కుమార్
18
Oct