BB6 TELUGU NEWS: Riyaz : తాండూరు సెప్టెంబర్ 27 అధునాతన సాంకేతిక కేంద్రం (ATC) నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని, (ATC)సెంటర్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
ఇవి ఒకప్పటి ఐటీఐలు కావు.. నైపుణ్యానికి, నాణ్యతను అందించే వేదికలు మన ఏటీసీలు.
నియోజకవర్గ యువతకు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను అందించే దిశగా ఏటీసీ సెంటర్ల ఏర్పాటు చేశాం.
తాండూరులో 172 సీట్లకు గాను పూర్తిగా భర్తీ కావడం సంతోషకరం, ప్రిన్సిపల్ కు, విద్యార్థులకు అభినందనలు తెలియజేసిన ఎమ్మెల్యే.
గత పాలకుల పాలనలో అభివృద్ధి పేపర్లకే పరిమితం అయ్యిందని ఎద్దేవ చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
