BB6 TELUGU NEWS CHANNEL : yadagiri : మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి గండీడ్ మండలంలో తేదీ: 26/ 09 / 2025 నాడు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీ ల యొక్క సామాజిక తనిఖీ ని మండలం లోని ఎం.పీ.డీ.వో. కార్యాలయం లో మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 17వ వార్షిక సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈ సామాజిక తనిఖీ లో జిల్లా స్థాయి అధికారులు మరియు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా అంబుద్స్మన్ సంతోష్, సామాజిక తనిఖీ బృందం పాల్గొన్నారు. ఈ సామాజిక తనిఖీలో భాగంగా ఏడు రిజిస్టర్లు గ్రామస్థాయిలో సెక్రటరీలు పకడ్బందీ గా నిర్వహించాలని ఎన్నిసార్లు సూచించినా వారు ఈ రికార్డులను మెయింటైన్ చేయడం లేదని, ప్రతి సామాజిక తనిఖీలో ఈ విషయాన్ని పదే పదే హెచ్చరించి చెప్పినా వారిలో మార్పు రావడంలేదని హెచ్చరించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మండల స్థాయిలో అన్ని గ్రామ పంచాయతీ లలో పకడ్బందీగా అమలు చేయడానికి మండల స్థాయిలో ఒక అసిస్టెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ ను, టెక్నికల్ అసిస్టెంట్స్లను, ప్రతి గ్రామ పంచాయతీ కి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించి వారిని మానిటరింగ్ చేయడానికి రాష్ట్ర స్థాయి వారి జీతభత్యాలకు సంబంధం లేకుండా అదనంగా కేంద్ర ప్రభుత్వం మండల ఎం.పీ.డీ.వో.లకు నెలకి దాదాపు 33 వేల రూపాయలు మెయింటెనెన్స్ చార్జీలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నప్పటికీ, వారు కనీసం గ్రామపంచాయతీ సెక్రటరీలను ఏడు రిజిస్టర్ లను మెయింటైన్ చేయాలని ఎన్నడూ వారికి హెచ్చరించిందే లేదు. గ్రామస్థాయిలో ఏడు రిజిస్టర్ లను గాని, ఉపాధి హామీ గ్రామస్థాయిలో నిర్వహించే పనులను గాని పర్యవేక్షించి, తనిఖీ చేసిన పాపాన పోలేదనీ ఈ సామాజిక తనిఖీల్లో బట్టబయలు అవుతుంది. అందుకే వారు ఏడు రిజిస్టర్ల ను నిర్లక్ష్యం వహిస్తూ ప్రతిసారి సామాజిక తనిఖీ బృందాలకు ఎలాంటి రిజిస్టర్లు చూయించడం లేదు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని ప్రోగ్రామ్ ఆఫీసర్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రక రకాల ఒత్తిడిలు చేసి, టార్గెట్లు ఇచ్చి, కూలీల శాతం పెంచాలని, కూలీల శాతం పెంచకపోతే మెటీరియల్ బిల్ అమౌంట్ పనులు సరైన పర్సంటేజీ లో అందించేదే లేదని కేంద్ర ప్రభుత్వం పెట్టే రకరకాల నియమ నిబంధన లకు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి వారి యొక్క టార్గెట్లు పూర్తిచేస్తే వచ్చిన క్రెడిట్ ను గ్రామపంచాయతీ సెక్రటరీలకు ఉపాధి హామీ పథకాన్ని గ్రామస్థాయిలో నిర్వహించేందుకు అదనంగా దాదాపు నెలకు ₹8,000 రూపాయలు వారి జీత భత్యాలు పెంచడం జరిగిందనీ, కానీ ఉపాధి హామీ సిబ్బంది అయినా ప్రోగ్రామ్ ఆఫీసర్లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎలాంటి వేతనంలో మార్పు రాలేదని పలువురు సిబ్బంది విచారం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ గ్రామ స్థాయిలో సెక్రటరీలు సరైన ఉపాధి హామీ నిర్వహించకుండా ఏడు రిజిస్టర్లు మెయింటైన్ చేయకుండా ఉన్నప్పటి కీ వారిపై మండల ఎం.పీ.డీ.వో.లు గ్రామపంచాయతీ సెక్రటరీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
