పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల మొత్తం 7,565 పోస్టులు.వెంటనే అప్లయ్ చేసుకోండి.

BB6 TELUGU NEWS CHANNEL :
స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ -2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా 7,565 పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అర్హులే. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 21.

పోస్టుల సంఖ్య: 7,565.

పోస్టులు:
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)పురుషులు 4,408,
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్సర్వీస్మెన్, ఇతరులు) 285,
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు (ఎక్స్సర్వీసెమెన్ కమాండో) 376,
కానిస్టేబుల్(ఎగ్జిక్యూటివ్) మహిళలు 2,496.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి 10+2 (సీనియర్ సెకండరీ)లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. పీఈ & ఎంటీ నిర్వహించే తేదీ నాటికి పురుష అభ్యర్థులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్(మోటార్ సైకిల్ లేదా కారు) కలిగి ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్ను పరిగణనలోకి తీసుకోరు.

వయోపరిమితి: 2025, జులై 1 నాటికి 18నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి.అభ్యర్థులు 2000, జులై 2వ తేదీ కంటే ముందు గానీ 2007, జులై 1 తర్వాత గానీ జన్మించిన వారై ఉండకూడదు. ఎస్సీ,ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు,స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఐదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 22.

లాస్ట్ డేట్: అక్టోబర్ 21.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.ఇతరులకు రూ.100.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్మెంట్ టెస్ట్(పీఈ అండ్ ఎంటీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్,మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ తేదీ: 2025, డిసెంబర్/2026,జనవరి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe