ఆటో డ్రైవర్ కొడుకు అవినాష్ గౌడ్ కు ఎంబీబీఎస్ సీటు…

BB6 TELUGU NEWS CHANNEL :
పెద్దపల్లి జిల్లాసుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ కొడుకు ఎంబీబీఎస్ సీటు సాధించాడు. గ్రామా నికి చెందిన శేఖర్ గౌడ్ ఆటోడ్రైవర్. అతని కొడుకు అవినాష్ను కష్టపడి చదివించాడు.

నీట్ లో ర్యాంకు సాధించగా రామగుండం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అవినాష్ తొ గర్రాయిలో ప్రైమరీ, కరీంనగర్ ప్రభుత్వ హై స్కూల్లో టెన్త్ చదివాడు. మెడిసిన్లో సీటు సాధించిన అవినాష్ ను స్థానిక నాయకుడు చిట్టవేని సదయ్య, గ్రామస్తులు అభినందించారు.

అడ్వర్టైజ్మెంట్
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe