BB6 TELUGU NEWS CHANNEL
రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి రామగుండం నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు పాలకుర్తి, అంతర్గం మండలాల అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించారు. నియోజకవర్గ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, శాశ్వత అభివృద్ధి పనులు, విద్య, వైద్యం, రహదారులు, శుద్ధి జలాలు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి రంగాల్లో తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరారు.
ప్రత్యేకించి రాబోయే నెలల్లో చేపట్టవలసిన అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమగ్రంగా చర్చించిన ఎమ్మెల్యే గారు, ప్రతి గ్రామం, ప్రతి వార్డు అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రహదారి మరమ్మతులు, కాలువల నిర్మాణం, పార్కులు, వీధి దీపాలు వంటి సదుపాయాలను వేగవంతంగా అమలు చేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా తగిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్
21
Sep