న్యూడ్‌ ( నగ్నంగా ) వీడియోకాల్‌తో నమ్మించి రూ.3.8 కోట్ల టోకరా

తెలంగాణ రాష్ట్రం నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్‌కు చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరీ, సన్నిహితురాలు మొల్లం మల్లిక అలియాస్‌ లిల్లీ (33)ని కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.

BB6 TELUGU NEWS CHANNEL
నిందితుల వివరాలు వెల్లడించిన సీఐ నాగరాజారావు. కర్నూలు, తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బలరాంనగర్‌కు చెందిన చిక్కిరి మల్లేష్, అతని భార్య పెరుమాళ్ల మేరీ, సన్నిహితురాలు మొల్లం మల్లిక అలియాస్ లిల్లీ (33)ని కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐ నాగరాజారావు శుక్రవారం వెల్లడించారు. సులువుగా డబ్బులు సంపాదించే ఉద్దేశంతో డిగ్రీ చదివిన నిందితులు ముగ్గురు కలిసి కుట్ర పన్ని సంయుక్త రెడ్డి పేరుతో ట్విట్టర్లో ఖాతా తెరిచారు. కర్నూలుకు చెందిన ఓ వ్యక్తి నమ్మి వారిని పరిచయం చేసుకోగా న్యూడ్ వీడియోలు పంపి నమ్మించారు. తర్వాత వారు
ఓ మహిళతో అసభ్యకర రీతిలో వాట్సప్ వీడియోకాల్చేయించి మాట్లాడించి నమ్మించి రెచ్చగొట్టేలా చేశారు.దీంతోపాటు తక్కువ ధరకు పొలాలు, స్థలాలు విక్రయిస్తామని మరికొన్ని కట్టు కథలు చెప్పారు. ఈక్రమంలో అతను పలు దఫాలుగా దాదాపు రెండేళ్లకాలంలో సుమారు రూ.3.80 కోట్లను వారికి పంపాడు.ఈ నగదుతో నిందితులు రూ.41.26 లక్షలతో రెండు కార్లు, ఒక బైకు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. మిగిలిన రూ.3.38 కోట్లను జల్సాలు, ఇతర అవసరాలకు ఖర్చు చేశారు. చివరికి వారు మోసగించారని తెలుసుకున్న బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టి ముగ్గురిని అరెస్టు చేశారు.

Advertisement
WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe