మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

BB6 TELUGU NEWS CHANNEL
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించడం జరిగింది.
జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో మొదటగా జిల్లా విద్యాధికారి ప్రవీణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల విద్యాధికారి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులు సన్మాన గ్రహీతలు ఎంతోమంది ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారి వారి అనుభవాలను పాలుపంచుకున్నారు. ఉపాధ్యాయుల గొప్పతనాన్ని కీర్తిస్తూ ఎంతోమంది ప్రసంగించారు. చివరిగా సన్మాన గ్రహీతలను పూలదండ శాలువా మెమొంటోస్ లతో సన్మానించుకోవడం జరిగింది. కార్యక్రమంలో మండల విద్యాధికారి రుద్రారం జనార్దన్ జిహెచ్ఎంలు తిరుపతమ్మ విజయలక్ష్మి రవిబాబు టీజీ యూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి హిరాలాల్, సిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేఎం చంద్రకాంత్ టి.ఎస్.యు.టి.ఎఫ్ మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, పి.ఆర్.టి.యు టి.ఎస్ మండల అధ్యక్షులు ఎ.శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.కృష్ణయ్య, పి ఆర్ టి యు తెలంగాణ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి, సిపిఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య టి జి యు ఎస్ మండల అధ్యక్షులు రవీందర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అందరు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe