BB6 TELUGU NEWS CHANNEL
మహాత్మా గాంధీ యూనివర్సిటీకి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. వైస్ఛాన్సలర్తో పాటు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బి.ఎస్. మూర్తి సమక్షంలో గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసులు ఘన స్వాగతం పలికారు.తదుపరి గవర్నర్ కాన్వొకేషన్ మీటింగ్ వేదికకు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులకు పీహెచ్డీ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు తమ భవిష్యత్తు జీవితాలను సువర్ణ భవిష్యత్తుకు బాటగా మార్చుకొని, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తదితరులు హాజరయ్యారు.
